This Day in History: 1980-06-27

1980: తెలుగు రంగస్థల నటి సురభి ప్రభావతి జననం

ప్రభావతి 1980జూన్ 27న శ్రీమతి కమలమ్మ, రేకందార్ కుమార్ బాబు దంపతులకు జన్మించింది.

రంగస్థల ప్రస్థానం: బాలనటిగా గుణసుందరి నాటకంలో నటించి 2003లో మదన కామరాజు నాటకం ద్వారా రంగస్థలంపై అడుగుపెట్టిన ప్రభావతి, ఇప్పటివరకు సుమారు 700 నాటికలు, నాటకాల్లో వివిధ పాత్రలు పోషించింది. విప్రనారాయణ, శ్రీకాళహస్తీశ్వర సాయుజ్యం, మృత సంజీవని, గణపతి మహత్యం, శశిరేఖా పరిణయం, నరకాసుర నాటకాల్లో ఈవిడ ధరించిన పాత్రల ద్వారా విశేష ప్రశంసలు అందుకుంది.

రచ్చబండ నాటికలోని దృశ్యం

నాటకాలు:

  1. మదన కామరాజు
  2. విప్రనారాయణ
  3. శ్రీకాళహస్తీశ్వర సాయుజ్యం
  4. మృత సంజీవని
  5. గణపతి మహత్యం
  6. శశిరేఖా పరిణయం
  7. నరకాసుర
  8. యజ్ఞం
  9. కవయిత్రి మొల్ల
  10. అంబేద్కర్ రాజగృహ ప్రవేశం
  11. బాపూబాట
  12. రాణి రుద్రమ

నాటికలు:

  1. రచ్చబండ
  2. సైకతశిల్పం
  3. త్యాగం
  4. పంపకాలు
  5. మాతృక

సినిమాలు:

  1. బతుకమ్మ
  2. మహాత్మ
  3. ఆదిగరువు అమ్మ
  4. మిడిల్ క్లాస్ మెలోడీస్‌

సీరియళ్లు:

  1. పూతరేకులు
  2. మాయాబజార్
  3. సరస్వతీ వైభవం

అవార్డులు:

ఈవిడ నంది, గరుడ (ఆయుష్మాన్‌భవ, నరకాసుర, విప్రనారాయణ) అవార్డులతోపాటు అనేక పరిషత్తుల నుండి ఎన్నో బహుమతులు అందుకుంది.

  1. ఉత్తమ నటి – మూడోదరి – పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు – 2012 (2012)
  2. ఉత్తమ నటి – రాణి రుద్రమ – శ్రీ కాళహస్తీశ్వర లలిత కళా పరిషత్, శ్రీకాళహస్తి (2018)
  3. ఉత్తమ నటి – రైతేరాజు -అపర్ణ నాటక కళాపరిషత్‌, తాడిపత్రిగొల్లప్రోలు మండలం, 2019 ఏప్రిల్ 5

పురస్కారాలు:

error: