This Day in History: 1992-06-27
కార్తికా నాయర్
కార్తికా నాయర్ (జననం 27 జూన్ 1992) ప్రముఖ భారతీయ సినీ నటి. ఆమె ముఖ్యంగా దక్షిణ భారత సినిమాల్లో నటించింది. 2009లో అక్కినేని నాగచైతన్య సరసన తెలుగు సినిమా జోష్ తో తెరంగేట్రం చేసింది కార్తికా. జీవా సరసన ఆమె నటించిన రెండో చిత్రం రంగంతో ఆమె ప్రసిద్ధి చెందింది. ఈ సినిమా అసలు తమిళం లో తీసి, తెలుగులో డబ్బింగ్ చేశారు.
తొలినాళ్ళ జీవితం:
కార్తీకా తల్లి ప్రముఖ నిన్నటి తరం నటి రాధ . ఆమె పెద్దమ్మ అంబిక కూడా ప్రముఖ దక్షిణ భారత నటే. కార్తికాకు ఒక తమ్ముడు, ఒక చెల్లెలు. ఆమె చెల్లెలు తులసి నాయర్ కూడా సినిమాల్లో నటించింది. కార్తికా ముంబైలోని పోడర్ అంతర్జాతీయ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అనుబంధ కళాశాలలో అంతర్జాతీయ బిజినెస్ డిగ్రీ చదువుకుంది కార్తికా.
కెరీర్: 2009లో తన 17వ ఏట తెలుగు సినిమా జోష్ తో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఆమె నాగచైతన్య సరసన నటించింది. ఆమె రెండో సినిమా రంగం. తమిళంలో తీసిన ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేయగా, రెండు భాషల్లోనూ విజయవంతం కావడం విశేషం. ఆ తరువాత ఆమె మలయాళంలో లెనిన్ రాజేంద్రన్ దర్శకత్వంలో మకరమంజు సినిమాలో నటించింది కార్తికా. ఆ తరువాత ఆమె భారతీరాజా దర్శకత్వంలో అన్నాకొడి సినిమాలో నటించింది.