This Day in History: 1932-12-28
1932 : పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ జాననం. భారతీయ మిమిక్రీ కళాకారుడు, రంగస్థల నటుడు. ధ్వన్యనుకరణ సామ్రాట్ బిరుదు పొందాడు.
ఆయన ప్రముఖులు, రాజకీయ నాయకులు, స్థానిక మాండలికాలు, నిజాంలను అనుకరిస్తూ ప్రజాదరణ పొందాడు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రదర్శన ఇచ్చిన మొదటి వ్యక్తి. ప్రపంచంలోనే తొలిసారిగా తెలుగు యూనివర్సిటీలో డిప్లొమా కోర్సును ప్రారంభించాడు. ఆయనకు లభించిన పురస్కారాలలో కొన్ని:
- 1977 ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి కళా ప్రపూర్ణ బిరుదు
- 1982 రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు
- 1987 జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు
- 1992 కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు
- 1997 కనకాభిషేకం
- 1998 ఎన్ టి ఆర్ ఆత్మ గౌరవ పురస్కారం
- 2001 పద్మశ్రీ
- 2005 తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం
- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు – 2018లో భాగంగా జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పురస్కారం అందజేయబడింది.