This Day in History: 1906-05-29
1906 : పద్మ భూషణ్ కడూర్ వెంకటలక్షమ్మ జననం. భారతీయ నృత్యకారిణి. మైసూరు రాజస్థానానికి చెందిన సుప్రసిద్ధ భరతనాట్య నర్తకి. మైసూరు శైలికి చెందిన భరతనాట్యంలో ఈమె ఆరితేరిన కళాకారిణి. భారత ప్రభుత్వం 1992లో మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ తో ఈమెను సత్కరించింది.
ఈమెను మైసూరు మహారాజా కృష్ణరాజేంద్ర ఒడయార్ IV ఆస్థాన విదుషీమణి (రాజనర్తకి)గా 1939లో నియమించాడు. ఆ తర్వాత భరతనాట్య కళాకారిణిగా ఈమె పేరు ఇంటింటా మారుమ్రోగింది. భరతనాట్యంలో మైసూరు శైలిని ఈమె తారాస్థాయికి తీసుకువెళ్ళింది. ప్యాలెస్‌లో చాముండి ఉత్సవాలలోను, దసరా నవరాత్రి ఉత్సవాలలోను, మహారాజా వర్ధంతి ఉత్సవాలలోను ఈమె నృత్యప్రదర్శన తప్పనిసరిగా ఉండేది.
మైసూరు ప్యాలెస్‌లో 40 యేళ్ల సేవ అనంతరం వెంకటలక్ష్మమ్మ తన స్వంత శిక్షణా సంస్థ “భారతీయ నృత్య నికేతన” ను ప్రారంభించింది.
మైసూరు విశ్వవిద్యాలయం 1965లో మొదటి సారి నాట్యశాస్త్రాన్ని ఒక కోర్సుగా ప్రవేశ పెట్టినప్పుడు దానికి ఈమెను తొలి రీడర్‌గా నియమించింది. వెంకటలక్షమ్మ ఎందరో దేశీయ, విదేశీ విద్యార్థులకు గురువుగా భరతనాట్యాన్ని నేర్పించింది. బెంగుళూరులోని “నూపుర స్కూల్ ఆఫ్ భరతనాట్యం”కు ప్రిన్సిపాల్‌గా వ్యవహరించింది. ఆమె అందుకున్న పురస్కారాలు:
- కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం. (1964) (కర్ణాటక రాష్ట్రం నుండి తొలి పురస్కార గ్రహీత)
- సంగీత నృత్య అకాడమీ అవార్డు (1976)
- మైసూరు విశ్వవిద్యాలయం నుండి డి.లిట్ (1977)
- కన్నడ రాజ్యోత్సవ పురస్కారం (1988)
- బెంగళూరు గాయన సమాజం వారిచే సంగీత కళారత్న(1989)
- పద్మభూషణ్ పురస్కారం (1992)
- నాట్యరాణి శాంతల రాష్ట్ర పురస్కారం (కర్ణాటక రాష్ట్రంలో నాట్య కళాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం) (1995)
- హంపి విశ్వవిద్యాలయం నుండి నాడోజ ప్రశస్తి (2001)