This Day in History: 1992-05-31

1992 : మిస్ ఇండియా ఎర్త్ శోభితా ధూళిపాల జననం. భారతీయ సినీ నటి, నృత్యకారిణి, మోడల్. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ గెలుచుకుంది. మిస్ ఇండియా 2013 మొదటి రన్నరప్. మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అక్కడ ఆమె మిస్ ఫోటోజెనిక్ మరియు మిస్ ఎకో-బ్యూటీ అనే రెండు అవార్డులను గెలుచుకుంది,

ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2013 టైటిల్ గెలుచుకున్న తర్వాత, ఫెమినా మిస్ ఇండియా యొక్క జోనల్ పోటీలో, ధూళిపాళ ఫెమినా మిస్ ఇండియా 50వ సంవత్సరంలో టాప్ 23లో ఆటో-ఎంట్రీని పొంది మొదటి రన్నరప్‌గా నిలిచింది. ఆమెకు మిస్ స్టైలిష్ హెయిర్, మిస్ అడ్వెంచరస్, మిస్ ఫ్యాషన్ ఐకాన్, మిస్ టాలెంట్, మిస్ డిజిటల్ దివా కూడా లభించింది. ఆమె కింగ్‌ఫిషర్ క్యాలెండర్ 2014 లో కూడా కనిపించింది

హిందీ, మలయాళం, తెలుగు, ఇంగ్షీషు భాషలలో పనిచేసింది. అనురాగ్ కశ్యప్ యొక్క థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0 (2016) లో ధూళిపాళ అరంగేట్రం చేసింది.

 

error: