Birth – On This Day  

Birth

1875 : భారతరత్న వల్లభాయ్ పటేల్ (వల్లభాయ్  ఝవేర్ భాయ్ పటేల్) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజనీతిజ్ఞుడు, రాజకీయవేత్త. భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రి.

1895 : పద్మ భూషణ్ సి కె నాయుడు (కొట్టారి కనకయ్య నాయుడు) జననం. భారతీయ క్రికెటర్. భారత క్రికెట్ జట్టుకు టెస్ట్ మ్యాచ్‌లలో మొదటి కెప్టెన్.

1926 : పద్మ విభూషణ్ నరీందర్ సింగ్ కపానీ జననం. భారతీయ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, ఆవిష్కర్త, వ్యవస్థాపకుడు, రైతు, పరోపకారి, కళాకారుడు. ఫైబర్ ఆప్టిక్స్‌ పితామహుడు.

1938 : సుందరం మాస్టర్ (ముగుర్ సుందర్) జననం. సౌత్ ఇండియన్ సినిమాలో డాన్స్ కొరియోగ్రాఫర్. ఆయన ముగ్గురు కొడుకులు కూడా సినీ నటులు, కొరియోగ్రాఫర్లే. ఆయన నేషనల్ ఫిల్మ్ అవార్డు తో పాటు ఫిల్మ్ ఫేర్ సౌత్, నంది, విజయ అవార్డులను గెలుచుకున్నాడు.

Oommen Chandy1943 : ఊమెన్ చాందీ జననం. భారతీయ రాజకీయవేత్త. కేరళ 10వ ముఖ్యమంత్రి. ఐక్యరాజ్య సమితి నుండి పబ్లిక్ సర్వీస్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయ ముఖ్యమంత్రి.

1986 : సంవృత సునీల్ జననం. భారతీయ నటి, టెలివిజన్ ప్రజెంటర్. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో 45 చిత్రాలకు పైగా పనిచేసింది. ఆసియన్ ఫిల్మ్ అవార్డులు అందుకుంది.